सत्यनारायण की सत्य कथा

सत्यनारायण की सत्य कथा

Story Source: रेवा खण्ड, स्कांध पुराण

Murli Date: 14-07-2020

Story in Hindi:

सत्यनारायण की सत्य कथा
(रेवा खण्ड, स्कांध पुराण)

भारत में अनेक लोग सत्यनारायण का व्रत रखते हैं और कथा भी सुनते हैं। सत्यनारायण की कथा में लिखा है कि यह व्रत दुःख और शोक आदि को शान्त करने वाला, धन-धान्य बढ़ाने वाला, सौभाग्य देने वाला तथा सब जगह विजय प्राप्त कराने वाला है। बताया गया है कि यह कथा नैमिषारण्य तीर्थ में सूत जी, जोकि व्यास जी के शिष्य थे, ने शौनकादि अट्टासी हज़ार ऋषियों को सुनाई। परन्तु जब मनुष्य प्रचलित सत्यनारायण कथा पढ़ता या सुनता है तो इसमें न तो श्री नारायण की कोई जीवन-कहानी है, न सत्य स्वरूप परमात्मा का कोई परिचय है और न ही किसी व्रत की व्याख्या की गयी है। केवल लिखा है कि अमुक-अमुक ने इस व्रत को किया तो उसे धन-धान्य, मुक्ति और वैकुण्ठ पद की प्राप्ति हुई और अमुक- अमुक ने इस व्रत को करने का संकल्प किया किन्तु किया नहीं या व्रत का प्रसाद नहीं लिया तो विपत्ति या दु:ख में पड़ गये।
उदाहरण के तौर पर इसमें सबसे पहली कथा तो यह है कि काशीपुरी में शिवानन्द नाम का एक अत्यन्त निर्धन बाह्मण था जो कि भीख माँगने पर भी भूख से पीड़ित रहता था। भगवान उसके सामने एक बूढ़े ब्राह्मण के रूप में आये और उन्होंने उसे सत्य नारायण का व्रत करने के लिए कहा। उस व्रत को करने से उसे धन-सम्पत्ति तथा सुख का लाभ हुआ। दूसरी कथा लकड़ी बेचने वाले एक निर्धन भील की है। वह भी इस व्रत को करने से निर्धनता, दुःख तथा शोक से छूट गया और अन्त में वैकुण्ठ में देवपद को प्राप्त किया।
सत्यनारायण कथा में जो सबसे बड़ी कथा लिखी हुई है वह यह है कि एक वैश्य ने यह संकल्प किया कि उसके सन्तान होगी तो वह यह व्रत अवश्य करेगा। परन्तु उसको जब एक कन्या उत्पन्न हुई तो उसने अपना वचन टाल दिया और कहा कि इसके विवाह के अवसर पर करूँगा। उस अवसर पर भी वह व्रत करना भूल गया। इसके परिणाम स्वरूप सत्यनारायण ने रुष्ट होकर उसे शाप दिया कि उस पर दु:ख आये। तभी वहाँ राजा के यहाँ चोरी हो गई और राजा के दूत, वैश्य और उसके दामाद को चोर मानकर पकड़कर राजा के पास ले गये। राजा ने उन्हें जेल में बंद कर दिया। उधर लीलावती (वैश्य की स्त्री) ने पति के लौटने के मनोरथ को लेकर सत्यनारायण व्रत किया और भगवान ने राजा को स्वप्न में आदेश दिया कि इन दोनों को छोड़ दो वरना मैं तुम्हारा नाश कर दूँगा।
जब राजा द्वारा मुक्त होकर दोनों अपने बेड़े की ओर लौट रहे थे तो सत्यनारायण स्वामी ने सादे वेष में आकर पूछा – “वैश्य, तुम्हारे बेड़े में क्‍या है?” वैश्य बोला – “क्या कुछ लेने का विचार है क्या? इसमें तो लता-पत्ता आदि है।” तब बदले हुए वेश में सत्यनारायण बोले – “तथास्तु”। इसके परिणाम स्वरूप उस बेड़े में पड़ा सब धन-सोना आदि लता-पत्ता ही बन गया। परन्तु जब वैश्य ने लौटकर उस साधु वेशधारी से दु:ख प्रगट किया तो उसने कहा – “तुम मेरी पूजा नहीं करते हो और व्रत नहीं करते हो इसलिए मेरी इच्छा से तुम्हें यह सब दुःख प्राप्त हो रहा है”। जब वैश्य ने व्रत करने का आश्वासन दिया तब भगवान की प्रसन्नता के फल स्वरूप लता-पत्ता के स्थान पर पहले की तरह सोना-चांदी, धन आदि वापस आ गए। वैश्य और उसका दामाद आगे नगर के तट तक आ पहुँचे और बेड़े को तट से लगाकर उन्होंने नगर की भूमि पर पग धरे। कलावती (वैश्य की पुत्री), जो कि सत्यनारायण व्रत कर रही थी, पति और पिता के बेड़े के आने की सूचना पाकर सत्यनारायण का प्रसाद छोड़कर बेड़े की ओर चल पड़ी। प्रसाद न लेने का परिणाम यह हुआ कि उसका पति अदृश्य हो गया और बेड़ा डूबकर सागर तल में विलीन हो गया। परन्तु जब कलावती प्रसाद खाकर लौट आई तो उसका पति पुन: प्रकट हो गया और डूबा हुआ बेड़ा भी तैर आया।

आध्यात्मिक भाव – श्री सत्यनारायण की कथा में जो वृद्ध ब्राह्मण आकर व्रत करने के लिए कहता है वे प्रजापिता ब्रह्मा हैं अर्थात्‌ सत्य स्वरूप शिव बाबा एक साधारण वृद्ध ब्राह्मण के तन में दिव्य प्रवेश होकर श्री नारायण बनने की सच्ची कथा सुनाते हैं और पवित्रता अथवा ब्रह्मचर्य रूपी व्रत बताते हैं। शिव परमात्मा उसी वृद्ध प्रजापिता ब्रह्मा रूप ब्राह्मण द्वारा ही इस समय के कंगाल भारत को कंचन के महलों वाला, सतयुगी पावन भारत अथवा स्वर्ग बनाते हैं। उसी रूप में भीलों के समान प्राय: निर्धन बने भारत को परमपिता शिव धनवान बना देते हैं और व्यापारियों के भी डूबे हुए जीव रूपी बेड़े को निकालकर पार उतारते हैं। सतयुग में सर्वगुण सम्पन्न, मर्यादा पुरुषोत्तम, 16 कला संपूर्ण श्री सत्यनारायण थे। वे ही त्रेतायुग में 14 कला सम्पन्न चंद्रवंशी बनते हैं। धीरे- धीरे वे पांच विकारों के जाल में जकड़ते जाते हैं। तब द्वापर में केवल 8 कला ही बचती है। आत्माभिमानी से देहाभिमानी और पूज्य से पुजारी बन जाते हैं। कलियुग के अन्त में जब पूर्ण विकारी बन जाते हैं, सभी मनुष्य आत्माएं भी बहुत दुःखी बन जाती हैं तब अपने बच्चों की पुकार सुनकर पतित-पावन परमपिता परमात्मा शिव गीता में अपने वचन अनुसार इस कलियुगी, आसुरी सम्पदा वाली सृष्टि पर दिव्य रीति से अवतरित होते हैं । जिस साधारण एवं वृद्ध मनुष्य के शरीर में (सत्यनारायण के 84 वें जन्म में) प्रवेश करते हैं उसे उसके पूर्व के सभी जन्मों की कथा सुनाकर पतित से पावन बनाते हैं और मुक्ति – जीवनमुक्ति का भागी बनाते हैं। यही है सत्य-नारायण की सच्ची कथा। यही वो कथा है जिससे साधारण मनुष्य (ब्रह्मा) फिर से श्री नारायण, सर्वगुण सम्पन्न बनते हैं। वास्तव में किसी भी नियम वा दिव्यगुण को धारण करके उसे अपनाये रहने के लिए दृढ़ संकल्प किये रहना ही व्रत लेना है। इस प्रकार जो कोई इस सच्ची कथा को सुने और पवित्रता का व्रत धारण करे तो वह अवश्य ही नर से श्री नारायण बनता है।

Story in English:

The true story of Satya Narayan
(Reva Khand, Skanda Purana)

In Bharat, since ancient times, people celebrate a religious ritual called ‘Satya Narayan Vrat’ with the belief that by performing this Vrat (vow), their sorrows and grieves will be eradicated, they will flourish with prosperity and that they will achieve success in all fields. During this vow, there is a custom of listening to the story of Satya Narayan Swami. It is said that this story was told by the great Saint ‘Suta’ to Shounika and other saints at the holy place ‘Naimisharanya’. But in this story, we neither find the true introduction of Satya Narayan Swami, nor his life history nor any description on how to perform the Vrat.
For example, in the first chapter of this story, it is said that one poor Brahmin by the name Sivananda attained wealth, peace and prosperity by listening to the story of Satya Narayana and performing this Vrat. In another story, it is said that one poor wood seller who could not even manage two square meals a day, was relieved from his poverty and sorrows and attained a high status in Vaikunth by listening to the story of Satya Narayana and performing this Vrat.
But nowhere it is described as to what is the actual story that they all listened to and become prosperous? It is also not described as to how they perform the Vrat? It only warns about the grave consequences of not performing the Vrat as intended. For example: if somebody promises to perform this Vrat but fails to do so or if someone does not accept the Prasadam (food offered to God) of this Vrat, he will suffer sorrows or face dangers in life.
One of the longest stories of this Vrat is narrated as below: A childless Vyshya thought that if he is blessed with a child, he would perform this Vrat. After some time, a girl child was born to him, and the girl was named as Kalavathi. But he did not perform the Vrat, as promised and postponed the idea of performing the Vrat and took another vow that he would perform the Vrat at the time of his daughter’s marriage. At the time of his daughter’s marriage, he totally forgot about his promise. Thus, Satya Narayan Swami got angry and cursed him. Thereafter, the entire situation got overturned. He was blamed for a robbery that occurred in the king’s palace. The Vyshya and his Son-in-law were arrested by the soldiers and were put in the prison. Praying for the welfare of her husband, Leelavathi (Vyshya’s wife) performed the Vrat. God appeared in the King’s dream and ordered him to release the Vyshya and his son-in-law.
After being released from the prison, these two Vyshyas came to their ship. Satya Narayan Swami in the disguise of an old Brahmin came before them and enquired, what were they carrying in their ship? Thinking that he wanted some donation from them, he replied that they only had waste leaves and grass in their ship. The old Brahmin blessed them, “Let it be so”. Immediately all the gold, money and valuables they had in their ship turned into leaves and grass. The Vyshya recognized the old Brahmin as Satya Narayan Swami. He repented for his mistake and prayed to the old Brahmin to pardon him. The old Brahmin reminded him of his promise of performing the Vrat and advised him to do it immediately. The Vysya assured Satya Narayan Swami that he would definitely perform the Vrat. Pleased by Vysya’s realization and assurance of performing the vrat he transformed all the leaves and grass again into their original form of gold, money and valuables. The Vysya and his son-in-law happily travelled in the ship and reached the shore of their city. Here, Vyshya’s daughter was performing the Vrat but on hearing the news of the arrival of her husband and father, she eagerly went to receive them without taking the prasadam. Due to this, the ship sank into the sea and her husband was not found. She heard from a Voice from Sky that all this happened because she had not taken the prasadam of the Vrat. After she took the Prasadam, her husband appeared before her. The ship which had sunk into the sea also came back onto the shore.

Spiritual Significance – In the story of this Vrat, the old Brahmin who advised the two Vyshyas to perform the Vrat is none other but the personification of Prajapita Brahma. The Supreme incorporeal God, Shiv Baba, incarnates into the body of Prajapita Brahma and narrates the true story of “How to become Sri Narayan?” and also teaches purity or the vow of Brahmacharya. By listening to this true story, insolvent Bharat will once again be transformed by Shiv Baba into the land of heaven. Just as the poor wood seller became a rich person, the poor Bharat will become a land of gold, wealth and prosperity. Just as the sunken ship of the merchants (Vyshyas) was saved, Bharat will also be rejuvenated by the Supreme God. In Satyug, Shri Narayan was full of divine virtues and complete in all 16 Celestial degrees. The same Sri Satya Narayan becomes Chandra Vanshi with 14 Celestial degrees in Tretayug. In the course of time, by becoming body conscious, he became Worshipper from Worship worthy. From being viceless he became vicious. By the end of Kaliyuga, the remaining Celestial degrees also diminished and almost completely disappeared. It is at this time that Shiv Baba incarnates into the body of an old person (84th birth of the soul of Sri Satya Narayan) and names him as Prajapita Brahma. Through him, Shiv Baba preached the true knowledge (Gyan) and taught the practice of Rajyoga. By practicing the same in his life, the soul of Satya Narayan once again became Pure, Perfect and Complete with all Divine Virtues. This alone is the real story of Sri Satya Narayan. Practicing Godly principles and Divine qualities and taking a strong vow to become an embodiment of those qualities is in the real sense means actually performing the Vrat. The Spiritual significance implies that those who follow the principles and listen to the story told by Shiv Baba, the Embodiment of Truth, transform themselves from ordinary human beings to deities.

Story in Telugu:

శ్రీ సత్యనారాయణ స్వామి సత్య కథ
(రేవా ఖండము, స్కాంద పురాణము)

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము దుఃఖ శోకములను హరింప చేసి, ధన ధాన్యములను పెంచి, అన్ని రంగములలోనూ విజయమును చేకూర్చునన్న విశ్వాసంతో భారతదేశములో ఎంతోమంది ఈ వ్రతమును ఆచరిస్తూ ఉంటారు, వింటుంటారు. ఈ కథ నైమిషారణ్య తీర్థమున సూత మహర్షి శౌనికాది మునులకు వినిపించారు అని అంటారు. కానీ శ్రీ సత్యనారాయణ స్వామి కథలో సత్యనారాయణుని సత్య పరిచయము కానీ, అతని జీవిత వృత్తాంతము కానీ, శ్రేష్ఠ వ్రత విధానము కానీ వివరించి లేవు.
ఉదాహరణకు ఈ కథలోని మొదటి అధ్యాయంలో – కాశీపుర నివాసి శివానందుడు అను పేద బ్రాహ్మణుడు ఈ వ్రతమును చేసి, వ్రత కథ విని ధన ధాన్యములు, సుఖ శాంతులు పొందుతాడనీ; మరొక కథలో కట్టెలను అమ్ముకుంటూ కష్ట జీవనము చేసే ఒక భిల్లు జాతి బోయవాడు ఈ వ్రతమును చేసి, దారిద్ర్య దుఃఖముల నుండి ముక్తుడై వైకుంఠ దేవ పదవిని పొందాడని వ్రాయబడింది. కానీ వీరు ఏ కథను విన్నారు? ఈ వ్రతమును ఎలా ఆచరించారు అని వివరించి లేదు. ఈ వ్రతము చేయాలనుకొని చేయకపోయినా, లేక వ్రత ప్రసాదమును స్వీకరించకపోయినా, అలాంటి వారికి ఆపదలు, దుఃఖములు ప్రాప్తించునని మాత్రం హెచ్చరింపబడినది.
సత్య నారాయణ వ్రత కథలో అన్నిటికన్నా పెద్ద కథలో ఇలా వ్రాయబడినది – సంతానం లేని ఒక వైశ్యుడు తనకు సంతానం కలిగితే ఈ వ్రతము చేస్తాను అని సంకల్పిస్తాడు. అతనికి ఒక కుమార్తె కలుగుతుంది. కానీ అతను వ్రతమును చేయక, కుమార్తె వివాహ సమయములో చేయాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు కూడా వ్రతమును చెయ్యడం మర్చిపోతాడు. అప్పుడు సత్య నారాయణునికి కోపం వచ్చి శపిస్తాడు. పరిస్థితులు తారుమారౌతాయి. అక్కడ రాజ భవనంలో జరిగిన దొంగతనం ఇక్కడ వైశ్యుడు, అతని అల్లుడిపై పడుతుంది. ఇద్దరినీ భటులు బంధించి కారాగారంలో వేస్తారు. తన భర్త క్షేమము కోరి లీలావతి (వైశ్యుడి భార్య) వ్రతమును చేస్తుంది. అప్పుడు భగవంతుడు రాజు కలలో కనిపించి ఆ ఇద్దరినీ విడిచిపెట్టమంటాడు.
ఆ వైశ్యులిరువురూ కారాగారం నుండి విడుదలై తమ ఓడ దగ్గరకు తిరిగి వస్తారు. సత్య నారాయణ స్వామి వృద్ధ సాధువు రూపంలో వచ్చి వారితో, ఓ వైశ్యులారా! మీ నావలో ఏమున్నది? అని అడుగగా, దానం కోసం వచ్చాడేమో అని భావించి, ఏవో ఆకులు, అలములు ఉన్నాయి అని వైశ్యుడు అంటాడు. సాధువు తథాస్తు అనగానే నావ లోని బంగారము, ధనము అంతా ఆకులు, తీగలుగా మారిపోతాయి. సాధువు సామాన్య వ్యక్తి కాదని, అతను సత్యనారాయణ స్వామి అని గ్రహించిన వైశ్యుడు సాధువును క్షమాపణ కోరుకుంటాడు. అప్పుడు సాధువు అతనిని సత్యనారయణ స్వామి వ్రతమును చేయవలసినదిగా సలహా ఇస్తాడు. తను తప్పకుండా వ్రతమును చేస్తానని మాట ఇస్తాడు. అందుకు స్వామి ప్రసన్నుడౌతాడు. ఆకులు, తీగలు తిరిగి బంగారము, ధనముగా మారుతాయి. వైశ్యుడు, అతని అల్లుడు సంతోషముగా తమ నగర తీరమునకు చేరుకుంటారు. ఆ సమయంలో కళావతి (వైశ్యుని కూతురు) సత్యనారాయణ వ్రతము చేస్తూ ఉన్నది. తన భర్త, తండ్రి క్షేమముగా తిరిగి వచ్చారన్న వార్త వినగానే ఉత్కంఠతో ప్రసాదమును స్వీకరించకుండానే ఒడ్డు దగ్గరకు వెళ్తుంది. అందువలన అమె భర్త కనిపించడు. ఓడ కూడా మునిగిపోతుంది. కళావతి ప్రసాదము స్వీకరించలేదు కాబట్టే ఇలా జరిగిందని ఆకాశవాణి తెలుపుతుంది. కళావతి ప్రసాదమును స్వీకరించిన తర్వాత ఆమె భర్త మళ్ళీ కనిపిస్తాడు. సముద్రమున మునిగిన ఓడ కూడా పైకి తేలుతుంది.
ఇలా ప్రతి కథలో వ్రతము చేస్తే లాభము అని, చెయ్యకపోతే నష్టము అని వివరించారే కానీ వ్రత విధానము కానీ, సత్య నారాయణుని సత్య కథ కానీ లేవు.

ఆధ్యాత్మిక రహస్యము – శ్రీ సత్య నారాయణ స్వామి వ్రత కథలో వ్రతమును చేయమని ఆదేశించిన ఆ వృద్ధ బ్రాహ్మణుడే ‘ప్రజాపిత బహ్మ’. శివ పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ తనువులో దివ్య అవతరణ గావించి శ్రీ సత్య నారాయణుని 84 జన్మల కథను, సత్య స్వరూపుడైన శివ పరమాత్ముని కథను వినిపిస్తారు. శివ పరమాత్మ, దివాలా తీసిన భారతదేశమును సిరి సంపదలతో తులతూగు పావన భూమిగా, స్వర్గముగా మారుస్తారు. సత్య నారాయణ కథలో తెలిపిన విధంగా కట్టెలమ్ముకుంటూ దుర్భర జీవితమును గడుపుతున్నబోయవానితో సమానముగా ఉన్న భారతదేశమును రత్నగర్భగా, సంపద భరితముగా మారుస్తారు. నీటిలో మునిగిన వ్యాపారుల ఓడను ఉద్ధరించినట్లుగా భారత భూమిని ఉద్ధరిస్తారు. సత్యయుగములో సర్వగుణ సంపన్నుడిగా, మర్యాదా పురుషోత్తముడిగా, షోడశ కళా పరిపూర్ణంగా ఉన్న సత్య నారాయణుడు త్రేతాయుగంలో 14 కళలతో చంద్ర వంశీయుడవుతాడు. కాలగమనంలో దేహాభిమానియై, పూజ్య దేవతా పదవి నుండి పూజారి అవుతాడు. నాడు నిర్వికారి జీవితము, నేడు వికారీ జీవితము. మిగిలిన 8 కళలు కూడా క్షీణించుచుండగా కలియుగాంతములో జ్యోతి స్వరూపుడైన శివ పరమాత్మ ఒక వృద్ధ మానవ శరీరంలో(సత్య నారాయణుని 84వ జన్మ) దివ్య అవతరణ గావించి ప్రజాపిత బ్రహ్మ అని నామధేయం చేసి అతని ద్వారా జ్ఞాన రాజయోగములను బోధిస్తారు. వాటిని తన జీవితములో ఆచరించి సత్య నారాయణుడు తిరిగి సర్వ గుణ సంపన్నుడిగా, పావనముగా తయారవుతాడు. ఇదియే అసలైన శ్రీ సత్య నారాయణ స్వామి సత్య కథ. ఏవైనా నియమాలను లేక దివ్య గుణములను ధారణ చేయుచూ, వాటిని స్వంతం చేసుకొనుటకు ధృఢ సంకల్పం చేయడమే వ్రత దీక్షను స్వీకరించుట అని అర్ధము. అనగా సత్య స్వరూపుడైన శివ పరమాత్మ ఉపదేశించిన “వ్రతము”, “సత్య కథ”ను ఎవరైతే ఆచరిస్తారో, వారు నరుడి నుండి శ్రీ నారాయణుడిగా అవుతారు.

Skip to content