नारद
Story Source: शिव पुराण
Murli Date: 11-05-2019
Story in Hindi:
नारद
(शिव पुराण)
नारद जी को भक्त श्रेणी में अग्रज माना जाता है। एक बार नारद जी ने अपनी भावनाओं तथा इच्छाओं पर विजय पाने के लिए गहन तपस्या करने का निर्णय लिया। उन्होंने एक आश्रम में आसन जमाकर तपस्या आरम्भ कर दी। मन को अशुद्ध संकल्पों से दूर कर शान्ति से ईश्वरीय याद में बैठ गये। नारद जी की इस तपस्या से इंद्र का आसन हिलने लगा। इसलिए नारद जी की तपस्या भंग करने के लिए सुन्दर अप्सराओं को भेजा गया लेकिन नारद जी अंश मात्र भी आकर्षित नहीं हुए।
जब नारद जी ने महसूस किया कि वे अपनी कामनाओं और इच्छाओं पर पूरा नियन्त्रण पा चुके हैं तब उन्होंने अपनी तपस्या को पूरा किया। तपस्या की सिद्धि से गर्वित नारद जी अपनी सिद्धियों को त्रिमूर्ति (बह्मा-विष्णु-शंकर) को बताने के लिए निकले। जब वे त्रिमूर्ति से मिलकर वापस आ रहे थे तब देवताओं ने नारद जी की परीक्षा लेना चाहा। देवताओं ने नारद जी के मार्ग में स्वर्ग से भी सुन्दर, अति सुन्दर शहर रचा। नारद जी को वह शहर देखने की इच्छा हुई और वे शहर के राजमार्ग से जाने लगे। तब उन्होंने शहनाइयों की आवाज सुनी। सैनिकों से जब उन्होंने कारण पूछा तो पता चला कि राजा अपनी कन्या लक्ष्मी के स्वयंवर की तैयारी कर रहे हैं। नारद जी को देखकर राजा ने उन्हें सादर आमन्त्रित किया और कन्या को आशीर्वाद देने के लिए कहा। जब लक्ष्मी जी नारद जी से आशीर्वाद लेने के लिए आयी तो उनकी सुन्दरता पर नारद जी मुग्ध हो गये और उन्हें वरने का संकल्प ले लिया।
उसी समय नारद जी वैकुण्ठ में विष्णु जी के पास गये और लक्ष्मी जी से विवाह करने की इच्छा प्रगट की और अनुरोध किया कि उसे हरि का रूप प्रदान करें ताकि लक्ष्मी जी स्वयंवर में उनको ही अपने पति के रूप में स्वीकार करें। हरि शब्द के दो अर्थ हैं – हरि अर्थात् सुन्दर रूप और बन्दर का भी भाव है। इन शब्दों के जादू से विष्णु जी ने नारद जी को नीचे से गले तक देवताई रूप दे दिया और मुख बन्दर का दिया। नारद जी जिनको यह पता नहीं था, बन्दर जैसा मुँह लेकर तुरन्त सभा में प्रवेश हुए। नारद जी बहुत प्रसन्न हो रहे थे कि लक्ष्मी जी जरूर उनको ही चुनेंगी। लक्ष्मी जी हाथ में माला लेकर चल रही थीं। जब वह नारद जी के निकट आयी तो बन्दर जैसा चेहरा देख उन्हें बहुत ही आश्चर्य हुआ। नारद जी इसी सोच में थे कि अब लक्ष्मी जी उन्हीं को वरमाला पहनायेंगी। लक्ष्मी जी ने उनकी ओर से हटकर विष्णु जी को अपना वर चुना।
बहुत ही अपमानित और चिंतित हो नारद जी वहाँ से निकल पड़े और सोचने लगे कि उनमें क्या नहीं है और विष्णु जी में क्या है जो लक्ष्मी जी ने विष्णु जी को अपना वर चुना। इस प्रकार मन में विचार करते हुए नारद जी एक नदी के पास रुके और उसमें अपना चेहरा देखा। नारद जी ने अब समझा कि लक्ष्मी जी ने उन्हें क्यों नहीं वरा। नारद ने ये भी समझ लिया कि वे अभी पूरी रीति से सम्पूर्ण नहीं बने हैं।
आध्यात्मिक भाव: – शिव बाबा श्रेष्ठ ज्ञान प्रदान कर रहे हैं ताकि हम बच्चे भी श्री लक्ष्मी, श्री नारायण जैसा ऊंच बनें। जब बाबा पूछते हैं कि आपको सतयुगी लक्ष्मी-नारायण बनना है या त्रेतायुगी राम-सीता बनना है, तो सभी कहते हैं कि हमको तो लक्ष्मी-नारायण ही बनना है। लक्ष्य रखना ठीक है लेकिन अपने लक्षणों पर भी समय प्रति समय ध्यान देना चाहिए। नारद जी जो कि लक्ष्मी जी को वरना चाहते थे अपने बन्दर जैसे मुंह के कारण असफल रहे। इसी प्रकार हममें भी अगर बन्दर जैसे गुण अर्थात् चंचलता और अस्थिरता होगी तो हम भी सतयुग में ऊंच पद प्राप्त नहीं कर सकते अर्थात् लक्ष्मी को वर नहीं सकते। ईश्वरीय ज्ञान, दर्पण जैसा है। हम अपने मन की अवस्था को उस दर्पण द्वारा जान सकते हैं और उन्नति पर ध्यान दे आगे बढ़ सकते हैं।
Story in English:
Narada
(Shiv Purana)
Narada is considered as the highest among all the devotees. Narada once decided to perform intense Yoga in order to control all his emotions and desires. Upon seating himself in the conducive setting of the great hermitage, Narada began his yogic practice. He sat for days in silence in the remembrance of God, after freeing his mind from impure thoughts. The throne of Indra started shaking due to the heat generated by Narada’s intense Yoga. Therefore, Indra sent a few beautiful angels to disrupt the Yogic practice of Narada but Narada remained unmoved.
After realising that he had gained complete control over his emotions and desires, Narada ended his Yoga and left the hermitage. Puffed up by the pride of his ascetic achievements, Narada set off to meet the Trimurti Gods (Brahma, Vishnu and Shiva) for narrating them about his newly acquired achievements. When Narada was coming back after meeting the Trimurti Gods, the deities decided to take a test of Narada’s ascetic achievements. They constructed a city more beautiful than the heaven on Narada’s path as he made his way back to earth from heaven. Narada developed a desire to visit the city and started walking on the royal path. The king of the city was preparing to hold Swayamvar (husband choosing ceremony) for his daughter Lakshmi. When the king came to know of the visit of the great sage, Narada, he invited him to the palace and requested him to bless his daughter. When Lakshmi came to Narada to take his blessings, he was so deeply impressed by the princess’s beauty that he took the vow of marrying her.
Soon after Narada ran to Vaikunth, the heavenly abode of Srihari (Vishnu). He told Vishnu that he wanted to marry Lakshmi Devi and requested him to bestow his godly form to him so that the bride would choose him only in the next day’s Swayamvar. Vishnu blessed the sage with his Godly form with the face of Hari (Hari has two meanings, one is another name of Vishnu which means ‘charming’ and the second meaning is ‘monkey’). So, Vishnu just used the gimmickry of words. The sage Narada set off to the Swayamvar ceremony with the body of God and the face of a monkey. Narada hurried to the palace where the ceremony was to take place. Many princes had assembled for the ceremony and they were all anxious to be chosen by the beautiful Lakshmi. Not knowing his actual appearance, Narada was quite confident about his selection since he was in Vishnu’s form. Sri Hari (Vishnu) was also present in the ceremony. Lakshmi Devi, with a garland in her hand, was passing through each one of them one by one having a close look at them. When she approached Narada, she was shocked to see the monkey face. Meanwhile, Narada was thinking that she was now going to put the garland in his neck only. But the princess calmly passed on to Sri Hari (Vishnu) and selected him as her husband.
Feeling worried and insulted on his way back, Narada was thinking as to what made the Lakshmi to choose Sri Hari instead of him? What was the difference between him and Sri Hari? Thinking so, Narada stopped for a while at a lake, where he could see his face in the water. He was extremely surprised to seed the face of a monkey on him. Narada understood now why he was not selected. Narada could also understand that he was yet to achieve the stage of completion.
Spiritual Significance: – Shiv Baba teaches us the highest knowledge and makes us worthy to reach the highest status of Sri Lakshmi and Sri Narayan. Whenever Baba asks us whether we would like to have the highest status of Lakshmi Narayan in Sat Yuga or the status of Sri Rama and Sita of Treta Yuga. We all say that we want to take the highest status of Sri Lakshmi and Sri Narayan. But Baba says that simply setting a high aim in the mind of becoming Sri Lakshmi and Sri Narayan is not sufficient, , it is also necessary to have a high character. Narada who went to marry Lakshmi could not succeed because of his monkey face. Similarly if we also have monkey like qualities such as fickleness, unstable mind and no control over emotions, we cannot become worthy of attaining the status of Sri Lakshmi and Sri Narayan. Our continuous effort in the four subjects of “Knowledge, Rajyoga, inculcation of divine virtues and Godly service” can only make us worthy. The knowledge given by Baba acts like a mirror which helps us to know the status of our mind. Hence, with the help of this mirror, we should continue to check the effort that we are making on the spiritual path vis-à-vis the progress made, from time to time.
Story in Telugu:
నారదుడు
(శివ పురాణము)
నారదుడు భక్తశ్రేణిలో అగ్రజుడు. ఒకసారి నారదుడు భావోద్వేగములను, కోరికలను జయించేందుకు మహా తపస్సు చేయ సంకల్పిస్తాడు. తపస్సుకు అనుకూలమైన స్థానమును ఎంచుకొని, ఎన్నో రోజులు మౌనములో ఉండి, తన మనసును చెడు సంకల్పముల నుండి దూరముగా ఉంచి కఠోర తపస్సు గావిస్తాడు. నారదుని తపోగ్ని ఇంద్రుడినే కదిలిస్తుంది. నారదుని తపస్సుని ఎలాగైనా భంగపరచాలని ఇంద్రుడు సుందర కన్యలను పంపిస్తాడు. కానీ నారదుడు వారి సౌందర్యమునకు ఆకర్షితుడు కాకుండా నిశ్చలముగా ఉంటాడు.
కొంతకాలము తర్వాత, నారదుడు తాను ఇంద్రియాలను జయించానని భావించి తన తపస్సును ముగిస్తాడు. తన తపస్సుతో గర్వాన్వితుడైన నారదుడు, తాను సాధించిన వాటి గురించి త్రిమూర్తులకు చెప్పుకోవాలని ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి కలుస్తాడు. కోరికలపై, భావోద్వేగాలపై విజయమును సాధించానని అనుకుంటున్న నారదునికి తన వాస్తవమును తెలియజేయాలని త్రిమూర్తులు నారదుని మార్గములో ఒక సుందర నగరమును సృష్టిస్తారు. మార్గ మధ్యములో తటస్థించిన ఆ నగరమును సందర్శించాలని నారదుడు సంకల్పిస్తాడు. ఆ నగరపు అందమంతా తిలకిస్తూ రాజ మార్గము వైపుకు వెళ్ళగా అక్కడ అతనికి మంగళ వాద్యములు వినిపిస్తాయి. రాజభటులను ఆ కోలాహలము గురించి అడుగగా మరుసటి రోజు రాజ పుత్రిక అయిన లక్ష్మీ దేవి స్వయంవరము కలదని చెప్తారు. నారదుని రాకను చూసిన రాజు అతనిని సాదరముగా లోనికి ఆహ్వానించి సకల మర్యాదలు చేసి గౌరవిస్తాడు. తన కుమార్తె అయిన లక్ష్మీ దేవిని పిలిచి నారద మునిని ఆశీర్వదించమని కోరుతాడు. లక్ష్మీ దేవిని చూసిన నారదుడు ఆమె సౌందర్యమునకు ముగ్ధుడై ఆమెను వరించాలని అనుకుంటాడు.
వెంటనే నారదుడు వైకుంఠములోని శ్రీహరి (విష్ణువు) వద్దకు వెళ్ళి తాను కళ్యాణ నగర రాజు కుమార్తె అయిన లక్ష్మీ దేవిని మోహించాననీ, ఆమెనే వరించాలని అనుకుంటున్నానీ, రేపు జరగబోయే స్వయంవరములో తనకు హరి ముఖమును ప్రసాదించమని కోరుకుంటాడు. హరి అనగా సుందర రూపము అనీ, కోతి అనీ రెండు అర్ధములు ఉన్నవి. ఈ మాటల గారడీతో శ్రీహరి నారదునికి క్రింది నుండి కంఠము వరకు దేవతా రూపమును, ముఖము మాత్రము కోతి రూపమును ఇచ్చి పంపుతాడు. ఇది తెలియని నారదుడు ఎంతో సంతోషముగా మరుసటి రోజు స్వయంవరమునకు సిద్ధమవుతాడు. మరుసటి రోజు స్వయంవరము ప్రారంభమయ్యింది. ఆ స్వయంవరానికి విష్ణువు, నారదుడు, ఎంతోమంది రాకుమారులు వచ్చారు. అక్కడ నారదుడి విచిత్ర రూపమును చూసి అందరూ నవ్వ సాగారు. లక్ష్మీ దేవి వరమాల పట్టుకుని ఒక్కొక్కరినీ పరిశీలిస్తూ ముందుకు కొనసాగింది. నారదుని వద్దకు వచ్చి ఒక్క క్షణము ఆగింది. ఇక తన మెడలోనే లక్ష్మీ దేవి వరమాల వేస్తుంది అని నారదుడు భావించాడు. కానీ లక్ష్మీ దేవి ముందుకు సాగి నారాయణుడి కంఠములో పూల హారమును వేస్తుంది.
నిరాశతో కృంగిన నారదుడు తిరుగు ప్రయాణమయ్యాడు. తనకు, విష్ణువుకు గల తేడా ఏమిటా అని ఆలోచిస్తూ మార్గ మధ్యములో ఉన్న ఒక సరోవరములో తన ముఖమును చూసుకుంటాడు. తాను కోతి రూపములో ఉండటము చూసి నివ్వెరపోతాడు. లక్ష్మీ దేవి తనను ఎందుకు వరించలేదో గ్రహిస్తాడు. తన నిగ్రహ శక్తి ఏపాటిదో గుర్తిస్తాడు.
ఆధ్యాత్మిక రహస్యము: – శివ బాబా మనకు శ్రేష్ఠమైన జ్ఞానమును వినిపించి ఉన్నతమైన లక్ష్మీ నారాయణ పదవిని పొందగలిగే అవకాశమును కల్పించారు. సత్య యుగ లక్ష్మీ నారాయణ పదవి తీసుకుంటారా లేక త్రేతాయుగ రామ పదవిని తీసుకుంటారా అని బాబా మనలను అడిగినప్పుడు మనమందరమూ లక్ష్మీ నారాయణ పదవినే తీసుకుంటాము అని బాబాతో చెప్తాము. కానీ లక్ష్యముతో పాటు తగిన పురుషార్థము, లక్షణములు కూడా ఉండాలి అని బాబా అంటారు. లక్ష్మిని వరించాలని వెళ్ళిన నారదుడు తన కోతి ముఖము కారణముగా ఆమెను వరించలేకపోతాడు – అలాగే మనము కూడా ఒకవేళ కోతి బుద్ధి అనగా చంచల స్వభావులుగా ఉన్నట్లయితే లక్ష్మీ నారాయణ పదవిని పొందలేము. కావున జ్ఞానముతో పాటు ధారణ కూడా ఉన్నట్లయితే, దైవీ సంస్కారాలను అలవర్చుకున్నట్లయితే మనము లక్ష్మిని వరించుటకు అనగా లక్ష్మీ నారాయణ పదవికి అర్హులు కాగలము. బాబా మనకు ఇచ్చిన జ్ఞానము మన మనసును చూసుకునేందుకు (పరిశీలించుకునేందుకు) ఉపయోగపడుతుంది. కావున ఎప్పటికప్పుడు మన మానసిక స్థితిని, పురుషార్ధమును గమనించుకుంటూ లక్ష్యానికి తగ్గ లక్షణములను ధారణ చేసుకోవాలి.