अमरकथा
Story Source: प्राचीन धर्म ग्रंथ
Murli Date: 08-12-2020
Story in Hindi:
अमरकथा
एक प्राचीन कथा के अनुसार, भगवान शिव ने माता पार्वती को अमरनाथ की गुफा में ‘सृष्टि की रचना’ की कथा सुनाई थी। कथा इस प्रकार है: एक बार नारद जी ने माता पार्वती को पूछा, “माता! स्वर्ग में सभी देवतायें मोतियों की माला धारण करते हैं लेकिन शिव जी के गले में मुंड की माला क्यों?” माता पार्वती जी ने इस विषय में अपनी अज्ञानता बताई। नारद जी के कहने पर पार्वती जी ने स्वयं शिव जी से इस विषय में पूछने का संकल्प किया। माता पार्वती ने शिव जी से मुंड माला के विषय में पूछा तो शिव जी ने इस विषय में न पूछने का अनुरोध किया लेकिन माता पार्वती नहीं मानी और जिद्द करने लगी कि उन्हें इस रहस्य के बारे में बताया जाये। तब शिव जी ने कहा, “सुनो महादेवी, मेरे गले में जितने मुंड हैं उतने जन्म आप ले चुकी हैं। आपके प्रत्येक खोपड़ी का मैं माला बनाकर अपने गले में धारण करता हूँ”। भगवान की यह बात सुनकर माता के मन में विचार आया, “मैं शिवजी की अर्धांगिनी तब फिर मृत्यु का चक्कर क्यों? अगर शिवजी अमर हैं तो मैं क्यों नहीं?” माता पार्वती ने शिव जी से अमरत्व प्राप्ति के बारे में पूछा।
शिव जी ने कहा, ठीक है। मैं आपको अमरत्व प्राप्ति की कथा सुनाता हूँ। आपको बहुत ध्यान से सुनना होगा। आपको कथा सुनते-सुनते हामी भरनी होगी। अगर आप बीच में सो गयी और हामी भरना बंद कर दिया तो मेरी कथा बीच में नहीं रुकेगी। कथा फिर से सुनाई भी नहीं जायेगी। अगर आपको ये शर्तें मंजूर हो तो कहिए! माता पार्वती ने दोनों शर्तें मान ली।
यह अमरकथा पार्वती जी के सिवाए और कोई न सुन ले, यह भी ध्यान रखना था। अत: शिवजी, पार्वती जी को लेकर हिमालय के एक निर्जन, बर्फीले पहाड़ की गुफा में पहुँचे। कथा प्रारंभ करने के पहले भगवान ने कापाली रुद्र को प्रकट किया और आसपास के जीवसृष्टि, पेड़, पशु आदि को भस्म करने का आदेश दिया और कापाली ने ऐसा ही किया। । इसके पश्चात् भगवान ने आसन लगाकर अमरकथा सुनाना प्रारम्भ किया। कथा सुनते-सुनते पार्वती माता को नींद आ गई। एक कबूतर था जो कथा के बीच में हामी भरता रहा और शिव जी ने समझा कि माता पार्वती हामी भर रही हैं। कापाली रुद्र ने गुफा के चारों ओर जीवसृष्टि को भस्मीभूत तो कर दिया था लेकिन आसन के नीचे एक कबूतर रह गया था। कुछ समय बाद माता पार्वती की नींद टूटी तो उन्होंने शिव जी से माफी माँगी। शिव जी आश्चर्यचकित रह गये। वे सोचने लगे कि कथा के बीच में कौन हामी भर रहा था? उन्हें बहुत क्रोध आया। अपना त्रिशूल उठाकर खड़े हो गये और तभी आसन के नीचे से एक कबूतर उड़कर भागा। शिव जी उसके पीछे भागे। कबूतर तीनों लोकों में आश्रय लेने के लिए फिरता रहा परन्तु किसी ने भी उसे आश्रय नहीं दिया। वह कबूतर मृत्यु के भय से महर्षि वेद व्यास के आश्रम में पहुँचा। उस समय वेद व्यास की पत्नी आलस्य और नींद में थीं। उन्होंने जम्भाई (उबासी) ली और मुख खोला तो कबूतर छोटा होकर मुख से होता हुआ उनके पेट में पहुँच गया। शिवजी स्त्री-हत्या का पाप नहीं करना चाहते थे। अत: वापस चले गये।
कबूतर बारह वर्ष तक महर्षि वेद व्यास की पत्नी के उदर में रहा। एक बार उनके पेट में बहुत दर्द हुआ तो वे वहाँ बह्माजी के पास गयीं | ब्रह्मा जी उन्हें साथ लेकर विष्णु जी के पास गये। विष्णु जी ने कहा, “इस समस्या का समाधान मेरे पास नहीं है। इस समस्या का हल केवल शिवजी ही कर सकते हैं। आप शिव जी के पास जायें”। इस प्रकार सभी शिव जी के पास पहुँचे। शिव जी ने सारी बातें सुनी और कहा कि आप सब पक्षीराज की स्तुति करें। सबने पक्षीराज की स्तुति की और अभयदान की प्रार्थना भी की। पक्षीराज बाहर निकलने को तैयार नहीं थे। अमरकथा के बल पर पक्षीराज को चारों वेदों का और अठारह पुराणों का ज्ञान हो चुका था। पक्षीराज ने कहा, “जब तक समस्त सृष्टि निर्मोही नहीं बनती मैं उदर से बाहर नहीं आऊंगा” । विष्णु जी ने अपनी दिव्य-शक्ति के बल पर क्षण भर के लिए समस्त जगत को निर्मोही बना दिया। इस पर कबूतर मानव के रूप में बाहर आ गया और वही बालक शुकदेव के नाम से विश्व-विख्यात हुआ।
अन्त में शुकदेव सबकी अनुमति लेकर घने जंगल में तप करने के लिए निकल पड़े। उन्होंने नैमिषारण्य में ऋषि-मुनियों को कथा सुनाने का आयोजन किया। वहाँ पर उन्होंने अमरत्व प्राप्त कराने वाली अमरकथा सुनाना प्रारंभ किया। भगवान शिव जी सोचने लगे कि अगर अमरकथा सुनकर सब अमरत्व प्राप्त कर लेंगे तो सृष्टि का संचालन नहीं हो सकेगा। तब शिव जी ने सबको वरदान दिया कि जो लोग अमरकथा सुनेंगे और अमरनाथ की यात्रा करेंगे, उन्हें अमरत्व तो प्राप्त नहीं होगा परन्तु शिव संदेश अवश्य प्राप्त होगा।
आध्यात्मिक भाव: – अमरत्व प्राप्ति का अर्थ है मृत्यु की भावना, मृत्यु के भय से दूर रहना। वह तभी हो सकता है जब स्वयं को स्थूल देह नहीं बल्कि एक अविनाशी आत्मा समझें | इसके लिए अमरनाथ शिव बाबा आत्मा रूपी पार्वती को, आत्मा जो अमर है, उसकी कहानी सुनाते हैं। अविनाशी आत्मा के ज्ञान से अमरनाथ शिव बाबा अपने बच्चों को अमर बनाकर अमरलोक (सतयुग) में ले जा रहे हैं।
Story in English:
Amarkatha
According to an age-old story, it is said that in the caves of Amarnath, Lord Shiva narrated the story of Amarkatha to his consort, Parvathi regarding the knowledge of Creation of Universe. The story goes on like this:
Once Narada questioned Parvathi, “Oh Mother, when all the deities in the heaven wear necklaces of pearls, why Shiva alone is wearing the garland of skulls?” Parvathi admitted that she doesn’t know the reason for the same. As per the advice of Narada, Parvathi herself asked Shiva about this matter to reveal her the reason. But Shiva advised her that it would be better not to ask this question. But Parvathi insisted to reveal her the secret for wearing the garland of skulls. Then God Shiva said, Devi, the number of skulls in my neck indicates the number of births you have taken. Hearing this, Parvathi was puzzled, When I am the wife of Lord Shiva, who is eternal, how shall I come into the cycle of birth and death. When Shiva is immortal why should I not attain immortality? Thinking thus, she asked Shiva to tell her the story about immortality.
Shiva agreed to tell her the story of Immortality but said to her, “Well, I will tell you the story of immortality. But you should listen to this with great attention. You must acknowledge all the while when I am telling the story. In case, if you do not acknowledge or if you fall asleep, then also I will not stop telling the story nor I will repeat the story. If you agree to these conditions, then I will tell the story”. Parvathi agreed to Shiva’s conditions.
Shiva took Parvathi to a lonely place into the caves of a snow hill in Himalaya mountains with the intention that nobody else should hear the story. Before starting to narrate the story, Shiva created Kapali Rudra and commanded him to destroy all the living creatures around that cave. Accordingly, Kapali Rudra destroyed all the life including birds, animals, trees etc. around that cave. Then, Shiva sat in yogic posture and started narrating the story of immortality. While listening to the story, Parvathi fell asleep. But one pigeon which was listening to the story kept saying Hmm… Hmm… Shiva was in an impression that Parvathi was listening and acknowledging and continued to tell the story. Though, Kapali Rudra had destroyed all the living creatures around the cave, this pigeon was left under the seat of Shiva. Meanwhile Parvathi woke up and begged pardon for her mistake of falling asleep. Shiva was wonder struck and thinking who was acknowledging all the while. Shiva raised with anger holding his weapon Trishula in his hand. Then the pigeon which was under his seat all the while flew away and searched all the three worlds for shelter and protection from the anger of Shiva but could not find a place of protection. With fear for life, it entered into the hermit of the saint Vedavyasa. At that time, wife of Vedavyasa was yawning in her sleep. The pigeon turned into miniature size and entered into her stomach through her mouth. Looking at this, Shiva thought that it was sinful to kill a female and went back from that place.
The pigeon remained in the stomach of vedavyasa’s wife for twelve years. Once she got unbearable stomach-ache. Then they went to Brahma, and he took them to Vishnu. Then Vishnu told them that he didn’t have the solution for that and Shiva alone could solve this problem. He took them to Shiva. Listening to all this, Shiva asked them to pray the pigeon king to come out. All of them prayed the pigeon king to come out. But it did not agree to come out of her stomach. The pigeon which heard the Story of Immortality understood the knowledge of all scriptures, became enlightened. It said that it would come out only when the entire creation attained detachment. Then Lord Vishnu turned the entire creation detached for one second. The pigeon came out from her stomach in the form of a human being.
That boy became renowned in the world by the name of Sukhdev. Taking leave from everyone, he went into the forests to perform intense meditation. He intended to narrate the story of Immortality to all the saints in the forest of Nymisaranya. But Lord Shiva thought if everyone heard this story, they would attain immortality and the entire creation would come to a halt. Thinking so, Shiva blessed that, all those who listened to the story would not become immortal but they certainly attain the benefit of message of Shiva.
Spiritual Significance: – The true meaning of Immortality is not avoiding death, but it means avoiding the fear and grief of death. The knowledge of attaining such a state of mind is narrated by Shiva Baba, the Amarnath in the mountains of Abu, to Parvathi i.e to the Human Souls. With the knowledge of the immortality, Shiva baba is making his children Immortal. Thus, Parvathi is not one. Every human soul which listens to the message of immortality from Shiva Baba is Parvathi.
Story in Telugu:
అమరకథ
ఒక ప్రాచీన కథ అనుసారంగా శివ భగవానుడు పార్వతి మాతకు అమరనాథుని గుహలో సృష్టి రచనకు సంబంధించిన జ్ఞానమును వినిపించాడు అని అంటారు. కథ ఈ ప్రకారంగా ఉంది – ఒక సారి నారదుడు పార్వతిని ఈ విధంగా ప్రశ్నస్తాడు, “మాతా! స్వర్గములో దేవీ దేవతలందరూ తమ మెడలో ముత్యాల, వజ్రాల హారాలను ధరిస్తే శివుడు మాత్రం పుర్రెల మాలను ఎందుకు ధరిస్తారు?” అయితే పార్వతి ఈ విషయము గురించి తనకు తెలియదని అంటుంది. నారదుడు చెప్పగా పార్వతి ఈ విషయము గురించి తానే స్వయముగా శివుడిని ప్రశ్నిస్తుంది. అందుకు శివుడు ఆ విషయము గురించి అడగకపోతేనే మంచిది అని పార్వతితో చెప్తాడు. కానీ పార్వతి అందుకు ఒప్పుకోక ఎలాగైనా తనకు రహస్యము వివరించవలసిందేనని మొండికేస్తుంది. అప్పడు శివుడు ఇలా అంటాడు, “దేవీ! నా మెడలో ఎన్ని పుర్రెలు ఉన్నాయో నీవు అన్నిజన్మలు తీసుకున్నావు అని అర్థము”. అది విన్న పార్వతి ఆలోచనలో పడుతుంది. నేను శివుని అర్థాంగిని. నేను జనన మరణ చక్రములో రావడమా? శివుడు అమరుడైనప్పుడు నేనెందుకు అమరత్వమును పొందలేను అని అనుకొని శివుని వద్దకు వెళ్ళి అమరత్వ ప్రాప్తి గురించి అడుగుతుంది.
అప్పుడు శివుడు, “సరే దేవీ! నేను మీకు అమరత్వమును ప్రసాదించే అమర కథను వినిపిస్తాను. కానీ ఈ కథను చాలా శ్రద్ధతో వినాలి. నేను కథ చెప్తున్నంత సేపు మీరు ఊ కొడుతూ ఉండాలి. ఒకవేళ మీరు కథ వింటూ మధ్యలో ఊ కొట్టకపోయినా, నిద్ర పోయినా నేను కథ చెప్పడము ఆపేది లేదు, కథను మళ్ళీ వినిపించేదీ లేదు. ఈ షరతులకు ఒప్పుకుంటే నేను కథ వినిపిస్తాను”. పార్వతి ఇందుకు ఒప్పుకుంటుంది.
ఈ అమరకథ పార్వతి తప్ప మరెవ్వరూ వినకూడదు అని శివుడు పార్వతిని హిమాలయ పర్వతము మీది ఒక నిర్జనమైన మంచు పర్వతము లోని ఒక గుహలోకి తీసుకువెళ్తాడు. కథను ప్రారంభించేముందు శివుడు కాపాలీ రుద్రుడిని సృష్టించి గుహ చుట్టుపక్కల ఉన్న జీవ సృష్టిని సంహరించమని ఆజ్ఞాపిస్తాడు. కాపాలీ రుద్రుడు ఆ గుహ చుట్టూ ఉన్న పక్షులు, చెట్లు మొత్తము జీవ సృష్టిని సంహరిస్తాడు. ఆ తర్వాత శివుడు ఆసనము వేసుకొని కథ వినిపించడము ఆరంభిస్తాడు. కథ వింటూ వింటూ పార్వతి దేవికి నిద్ర వస్తుంది. అయితే కథ మధ్యలో ఒక పావురము కథను వింటూ ఊ, ఊ అని అంటూ ఉండేది. అది విని శివుడు పార్వతీ దేవియే ఊ కొడుతుందేమో అని అనుకుంటూ కథ చెప్పసాగాడు. కాపాలీ రుద్రుడు గుహ చుట్టుపక్కల ఉన్న జీవ సృష్టిని భస్మం చేసాడు. కానీ ఈ పావురము శివుని ఆసనము కింద ఉండిపోయింది. ఇంతలో పార్వతికి మెలకువ వచ్చి తన తప్పుకు శివుడిని క్షమాపణ కోరుకుంటుంది. ఆశ్చర్యచకితుడైన శివుడు కథ చెపుతున్న సమయములో ఊ కొట్టినదెవరా అని ఆలోచించసాగాడు. క్రోధముతో శివుడు అతని త్రిశూలము తీసుకుని నిలబడ్డాడు. అంతలో అతని ఆసనము కింద నుండి పావురము బయటకు ఎగిరింది. ఆశ్రయము కోసం పావురము మూడు లోకాలు తిరిగింది. కానీ ఎక్కడా దానికి ఆశ్రయము లభించలేదు. ప్రాణ భయముతో పావురము వేద వ్యాసుని ఆశ్రమంలోకి దూరింది. అదే సమయాన వేదవ్యాసుని భార్య నిద్రపోతూ ఆవలిస్తుంది. పావురము చిన్నదిగా మారి వేదవ్యాసుని భార్య నోటిగుండా ఆమె కడుపులోకి ప్రవేశిస్తుంది. అంతా చూస్తున్న శివుడు స్త్రీ హత్య నేరమని భావించి అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోతాడు.
పావురము పన్నెండు సంవత్సరాల వరకు వేదవ్యాసుని భార్య ఉదరము (కడుపు) లేనే ఉంది. ఒకసారి ఆమెకు భరించలేని కడుపు నొప్పి వస్తుంది. అప్పుడు వారు బ్రహ్మా వద్దకు వెళ్తారు. బ్రహ్మ వారిని విష్ణువు వద్దకు తీసుకువెళ్తాడు. అప్పుడు విష్ణువు, “ఈ సమస్యకు సమాధానము నా దగ్గర లేదు. శివుడు మాత్రమే దీనిని పరిష్కరించగలరు” అని వారిని శివుని వద్దకు తీసుకువెళ్తాడు. శివుడు అంతా విని పక్షి రాజును స్తుతించమని అంటాడు. అందరూ పక్షిరాజును స్తుతిస్తారు. అయితే ఆ పావురము బయటకు రావడానికి అంగీకరించదు. అమరకథ విన్న పావురము వేద శాస్త్రముల జ్ఞానమును తెలుసుకొని జ్ఞానిగా అవుతుంది. సృష్టి అంతా నిర్మోహిగా అయితేగానీ తాను బయటకు రానని పావురము అంటుంది. అప్పుడు విష్ణువు తన శక్తితో క్షణకాలము కోసము సృష్టినంతా నిర్మోహిగా చేస్తాడు. లోపల ఉన్న పావురము మానవ రూపంలో బయటకు వస్తుంది.
ఆ బాలుడు సుఖదేవుడు అన్న పేరుతో విశ్వవిఖ్యాతినొందుతాడు. సుఖదేవుడు అందరి దగ్గర సెలవు తీసుకొని తపస్సు కొరకు అడవులలోకి వెళ్తాడు. అతడు నైమిషారణ్యమున ఋషులు, మునులకు అమరకథ వినిపించాలని సంకల్పిస్తాడు. అయితే అందరూ అమరకథను విని అమరత్వమును పొందినట్లయితే సృష్టి సంచాలనము జరుగదు అని భావించిన శివుడు ఈ విధంగా వరమిస్తాడు, “అమరకథను విన్న ప్రతి ఒక్కరూ అమరత్వమును పొందరు కానీ శివ సందేశమును మాత్రము అవశ్యము పొందగలరు”.
ఆధ్యాత్మిక రహస్యము: – నిజమైన అమరత్వము అంటే మరణము లేకుండుట కాదు కానీ మరణ భయము, బాధ లేకుండుట. అటువంటి స్థితిని కలిగించే జ్ఞానమును శివబాబా (అమరనాథుడు) ఆబూ పర్వతము మీద (పార్వతికి పర్వతము పైన కథ వినిపించుట) తన పిల్లలకు వినిపిస్తున్నారు. పార్వతి అనగా మానవాత్మలకు, శివబాబా అమరకథను వినిపిస్తున్నారు. అవినాశీ అయిన ఆత్మ జ్ఞానముతో నిజమైన అమరులుగా శివబాబా తన పిల్లలను తయారుచేస్తున్నారు.